HIT 3 | నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా అదరగొడతున్నాడు. కోర్ట్ సినిమాతో నిర్మాతగా పెద్ద హిట్ సాధించిన నాని తాజాగా హిట్ 3తో నటుడిగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా శైలేష్ కొలను తెరకెక్కించిన సైకో థ్రిల్లర్ హిట్ 3 మే 1న భారీ ఎత్తున రిలీజ్ అయింది. మూవీ ప్రమోషన్స్ జోరుగా, సాగాయి. ట్రైలర్ చూసే మూవీ సూపర్ హిట్ అవుతుందనే అంచనాకి వచ్చారు ఫ్యాన్స్. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండే పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించి ప్రేక్షకులకి మంచి మజాని అందించాడు.
హిట్ 3 చిత్రం దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లోనూ సందడి చేస్తుంది. ప్రీ బుకింగ్స్ లోనే హవా చూపించిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే జోష్ కొనసాగిస్తుంది. ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బుక్ మై షోలో ఫస్ట్ డే రెండు లక్షల కంటే ఎక్కువ టికెట్స్ అమ్ముడు అయ్యాయని తెలిసింది. నాని కెరీర్లో బెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసిందని తెలియజేశారు. మొదటి రోజు చిత్ర ఆక్యుపెన్సీ క్రమేపి పెరిగింది. మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ ఆల్మోస్ట్ 80 పర్సెంట్ ఉండగా, మధ్యాహ్నం నుంచి థియేటర్లకు ఎక్కువ మంది జనాలు రావడంతో మ్యాట్నీ 92 పర్సెంట్, ఈవెనింగ్ షోస్ 91 పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేశాయి.
నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో తెరకెక్కిన సైకో థ్రిల్లర్ మూవీ హిట్ 3. నాని ఈసినిమాను నిర్మిస్తూ.. నటించాడు ..మాస్ పల్స్‌కు తగ్గట్టుగా హిట్ 3ని డిజైన్ చేశాడు శైలేష్ కొలను. డైరెక్టర్ స్ట్రాటజీ బాగా పనిచేయడంతో మూవీ మంచి హిట్ అయింది. మాస్ ఏరియా నుంచి హిట్ 3 సినిమాకు అదిరిపోయే కలెక్షన్లు రావడం పక్కా అంటున్నారు. అంతే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండడంతో అక్కడ కూడా ఈ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైన హిట్ 3 తొలి రోజు సాధించిన కలెక్షన్లను చూసి నాని టీమ్ మురిసిపోతున్నారు. ఈ సినిమా దెబ్బకు నాని టైర్ 1 హీరోల లిస్ట్ లోకి వచ్చినట్టే అంటున్నారు. చెప్పి మరీ హిట్స్ కొడుతున్న నాని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.