HIT-2 Release Date | యువ హీరో అడవిశేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడ. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన తలరాతను తానే రాసుకున్నాడు. ‘క్షణం’ సినిమాతో హీరోగా మొదటి సక్సెస్‌ను అందుకున్న అడవిశేష్ ఇప్పటి వరకు వెనకకు తిరిగి చూసుకోలేదు. నటుడిగానే కాకుండా గొప్ప రైటర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్-2’. సైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో వచ్చిన ‘హిట్’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. మొదటి పార్ట్‌లో విశ్వక్సేన్ హీరోగా నటించగా, సెకండ్ పార్ట్‌లో అడివిశేష్ నటించాడు. ఈ చిత్రంపై ప్రేక్షకులలో మొదటి నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి.
తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ప్రకటించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. అడివి శేష్ ఇంటెన్సిటీతో ఏదో గమనిస్తున్నట్లు పోస్టర్ ఉంది. మీనాక్షీ చౌదరీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిరినేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అడివిశేష్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘మేజర్’ కూడా విడుదలకు సిద్దంగా ఉంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.
JULY 29th 🔪 #HIT2
Sharper than ever…. pic.twitter.com/o0ZFpwQpOI— Nani (@NameisNani) May 2, 2022