PT Sir | తమిళ సంగీత దర్శకుడు నటుడు హిప్హాప్ తమిళన్ (ఆది) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పీటీ సర్(PT Sir). ఈ సినిమాకు కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహించగా.. కాశ్మీరా పరదేశి, అనిఖా సురేంద్రన్ కథానాయికలుగా నటించారు. స్కూల్ కం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం మే 24న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్‌ను మెప్పించలేకపోయింది.
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో అందుబాటులో ఉండగా.. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది.