అరవింద సమేత చిత్రం తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. దాదాపు మూడేళ్లు ఈ సినిమాకి కాల్షీట్స్ కేటాయించిన జూనియర్ త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. జనతా గ్యారేజ్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రానున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ ప్రతిష్టాత్మక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని తీసుకున్నారు అన్న దానిపై చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ కంపోజర్ మణిశర్మ, దేవీ శ్రీ ప్రసాద్, ఎస్ థమన్ సహా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఫిలిం నగర్ సమాచారం మేరకు కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్‌ని సంప్రదించారని, ఆయన కూడా ఓకే చెప్పాడని టాక్. అయితే ఎన్టీఆర్, కొరటాల శివ ప్రాజెక్టులో పని చేసేందుకు అనిరుధ్ రవించందర్ ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్ చేశాడట. అతని టాలెంట్‌ని బట్టి మేకర్స్ కూడా అంత ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది.