Pawan Kalyan | జనసేనకు షాక్.. పవన్ కళ్యాణ్ సభపై హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ!
Pawan Kalyan | హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan | హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
నేడు హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఈ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేస్తూ పర్మిషన్ నిరాకరించారు. ఇక పోలీసుల నిర్ణయంతో జనసేన నేతలు తక్షణమే న్యాయపోరాటానికి దిగారు. సభకు ఎలాగైనా అనుమతి సాధించాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నాయకులు తెలంగాణ హైకోర్టులో అత్యవసరంగా హౌజ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్టు జనసేన పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. సభ నిర్వహణకు అనుమతించాలంటూ వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పోలీసులు భద్రతా కారణాల రీత్యా అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, న్యాయస్థానం కూడా పిటిషన్‌ను తిరస్కరించడంతో పవన్ కళ్యాణ్ హైదరాబాద్ సభ నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

