Salaar Shooting Update | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలనున్నాయి. అందులో ప్రశాంత్‌నీల్ ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పటికే ఈ కాంబోపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘కేజీఎఫ్ చాప్టర్-2’ చూసిన తర్వాత సలార్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. చాప్టర్-2 చూసిన ప్రేక్షకులు సలార్‌లో ప్రభాస్‌ను నీల్ ఏ రెంజ్లో చూపిస్తాడో అని ఆత్రుత మొదలైంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
సలార్ మేజర్ షెడ్యూల్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ప్రశాంత్‌నీల్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో నటించనున్నాడు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రభాస్ లేటెస్ట్గా నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘తన్హాజీ’ ఫేం ఓ రౌత్ తెరకెక్కించాడు. దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని అశ్వినీదత్ రూపొందిస్తున్నాడు.