Hidimba Movie On Ott | ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ టైమ్ బాలేకో, అదృష్టం కలిసిరాకో అన్ని డిజాస్టర్లుగానే మిగులుతున్నాయి. రాజు గారి గది సిరీస్‌లో తొలి రెండు పార్టులు అశ్విన్‌కు కాస్త మంచి పేరే తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత వచ్చిన మూడో పార్ట్ మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో దెబ్బకు మూడేళ్లు గ్యాప్ తీసుకుని హిడింబతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై మాములు బజ్ ఏర్పడలేదు. టీజర్, ట్రైలర్ సహా భారీ ప్రమోషన్లు సినిమాపై వీరలెవల్లో హైప్ తీసుకొచ్చాయి. తీరా రిలీజయ్యాక సినిమా మిక్స్డ్ రివ్యూలు తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా అశ్విన్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది.
నిజానికి ఈ సినిమా కథ చాలా బాగుంటుంది. కట్టిపడేసే స్క్రీన్‌ప్లేతో పాటు, కాస్త రిచ్ విజువల్స్ ఉంటే మాత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్ అయ్యేది. అలా అని సినిమా ఏం తీసి పారేసేలా ఉండదు. ఒక సర్టెన్ ఆఫ్ ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు కూడా. కంటెంట్ వైజ్ ఈ సినిమాకు వంద మార్కులు వేయోచ్చు. కొన్ని సీన్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ట్విస్ట్ మాత్రం వేరే లెవల్లో ఉంటుంది. ఇలాంటి కథ టాలీవుడ్ హిస్టరీలోనే మనుపెన్నడూ రాలేదనండంలో అతిశయోక్తి లేదు. కాగా స్క్రీన్‌ప్లేను కాస్త టైట్‌గా రాసుకుని, కొన్ని సన్నివేశాలు ఎడిటింగ్ చేసుంటే మాత్రం ఈ సినిమా అశ్విన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయ్యేది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది.
తెలుగులో అగ్ర స్థానంలో దూసుకుపోతున్న ఆహా సంస్థ ఈ సినిమా హక్కులను దక్కించుకుంది. ఆగస్టు 10 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది. అనీల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవిఘ్నేష్ సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించాడు. అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్గా నటించింది.