Hidimba Movie | కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు సైతం పెద్ద సినిమాల రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతాయిని ఇప్పటికే చాలా సినిమాలు రుజువు చేశాయి. కాగా తాజాగా నెల రోజుల గ్యాప్ లో రిలీజైన సామజవరగమన, బేబి సినిమాలు కూడా ఊహించని స్థాయిలో బాక్సాఫీస్ ను ఊపేస్తున్నాయి. రెండు సినిమాలు వేటికవే భిన్నం. ఒకటి పూర్తి కామెడీ యాంగిల్ లో సాగగా.. మరొకటి ఎమోషనల్ లవ్ స్టోరీ యాంగిల్ లో సాగింది. ఈ రెండు సినిమాలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. మూడు వారాల కిందట రిలీజైన సామజవరగమన రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. నిజానికి ఈ సినిమాపై రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాల్లేవు. ప్రీమియర్ టాక్ కాస్త బలం చేకూర్చినా.. ఓపెనింగ్స్ సో సోగానే వచ్చాయి. ఏమంట మొదటి ఆట పడిందో.. అప్పటి నుంచి మౌత్ టాక్ తో సినిమా పుంజుకుంది. రెండో రోజు నుంచి ఏ థియేటర్లో చూసిన నిండుగా జనం కనిపించారు. వీక్ డేస్ లోనూ చాలా చోట్లు ఈ సినిమాకు హౌజ్ ఫుల్ బోర్డులు పడ్డాయంటే జనాలకు ఈ సినిమా ఎంత పిచ్చిగా నచ్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత రీపీటెడ్ గా ఆడియెన్స్ ఈ సినిమాకు వచ్చారు.
సామజవరగమన ఇంపాక్ట్ కొనసాగుతుండగానే గత వారం బేబి వచ్చింది. ఈ సినిమాపై కూడా రిలీజ్ ముంగిట పెద్దగా అంచనాల్లేవు. కానీ ప్రీమియర్ షోల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కల్ట్ బొమ్మ అంటూ రివ్యూలు ఇచ్చే సరికి.. అంతలా సినిమాలో ఏముందా అని జనాలు థియేటర్ పరుగులు పెడుతున్నారు. తొలిరోజే దాదాపు ఏడు కోట్ల రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టిందంటే ఈ సినిమాను జనాలు ఏ రేంజ్ ఆదరిస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అసలు స్టార్ కాస్ట్ లేదు. పెద్ద డైరెక్టర్, పెద్ద ప్రొడక్షన్ సంస్థ అంత కన్నా కాదు. కేవలం కంటెంట్‌ను నమ్ముకుని సినిమా తీశారు. ఇప్పుడా నమ్మకమే కోట్లు కుమ్మరిస్తుంది. హిట్ నుంచి డబుల్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ దిశగా బేబి సినిమా దూసుకుపోతుంది. నాలుగు రోజుల్లోనే ముప్పై కోట్లు దాటేసిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో రూ.50 కోట్ల గ్రాస్ ను ఈజీగా టచ్ చేస్తుంది.
ఇక ఈ వారం విడుదల కాబోతున్న హిడింబ కూడా అదే రేంజ్ లో హిట్టవబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. హిట్టు చూసి ఏళ్లయిన అశ్విన్ బాబుకు ఈ సినిమా కలిసి వస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. టీజర్, ట్రైలర్ గట్రా సినిమాపై మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేశాయి. దానికి తోడు చిత్రబృందం తాజాగా ప్రీమియర్ షోలు కూడా వేసింది. ప్రీమియర్ షోల నుంచి హిండింబకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ట్విస్ట్ లు అరాచకం అని, కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా ఊహకందని రేంజ్ లో ఉందని రివ్యూలు ఇచ్చేస్తున్నారు. దాంతొ మెల్లిగా ఈ సినిమాపై మంచి హైప్ నెలకొంటుంది. మరో 24గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సామజవరగమన, బేబి రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి.