‘ఇది నా భర్తకు అంకితం ఇస్తున్నా.. చాలా ప్రత్యేకమైన పాట.. తను ఎప్పటిలాగే ఆలస్యంగా వస్తున్నారు.. పాట నా మాతృభాష తెలుగులో ఉంది’ అంటూ మృణాళ్ ఠాకూర్ మాటలు వినిపిస్తున్నాయి. అంతర్లీనంగా ఏదో కథ చెపుతున్నట్టున్న ఈ మాటల వెనకే పాట మొదలవుతుంది. ఇది నాని ‘హాయ్ నాన్న’ సినిమాకు చెందిన మూడవ పాట. మృణాళ్ఠాకూర్ పాయింట్ ఆఫ్ఫ్యూలో మొదలయ్యే ఈ పాట కథకు చాలా కీలకమని దర్శకుడు శౌర్యువ్ అన్నారు.
హీరోహీరోయిన్ల వైవాహిక జీవితానికి ఈ పాట అద్దం పడుతుందని, హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన మెలొడీగా ఈ పాటను స్వరపరిచారని నిర్మాతలు మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల తెలిపారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కాలభైరవ, శక్తిశ్రీ గోపాలన్ ఆలపించిన ఈ గీతం సినిమాకే హైలెట్ అని వారు చెప్పారు. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్ వర్గీస్.