Hi Nanna | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా చిత్రం హాయ్ నాన్న (Hi Nanna). నాని 30 (Nani 30)గా వస్తోన్న ఈ చిత్రానికి కి డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా మేకర్స్ హాయ్ నాన్న ఫస్ట్ లుక్‌తోపాటు గ్లింప్స్ ను విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.
కొన్ని రోజులుగా కొనసాగుతున్న షెడ్యూల్లో మృణాళ్ ఠాకూర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసిందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. అంతేకాదు త్వరలోనే నాని టీం నెక్ట్స్ షెడ్యూల్లో జాయిన్ కాబోతుందని టాక్. మృణాళ్ ఠాకూర్ ఇందులో యశ్న పాత్రలో నటిస్తోంది. నాని కూతురు పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. మృణాళ్ ఠాకూర్‌ను తన స్నేహితురాలికి పరిచయం చేస్తూ బేబి కైరా చెప్తున్న డైలాగ్స్‌తో షురూ అయిన టైటిల్ గ్లింప్స్.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో హర్ట్ టచింగ్ ట్యూన్‌తో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
హాయ్ నాన్న చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్, నాని, బేబి కైరా మధ్య సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు గ్లింప్స్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..
ఈ చిత్రానికి ప్రవీణ్ ఆంటోనీ ఎడిటర్ కాగా.. జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్ కాగా.. జెర్సీ, శ్యామ్ సింగరాయ్ సినిమాల తర్వాత కెమెరామెన్ సను జాన్ వర్గీస్ ఐఎస్సీ మరోసారి నానితో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం.