HEROINES| ఇప్పుడు కొందరు భామల పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక సోషల్ మీడియాతో పలకరిస్తున్నారు. క్రేజ్ ఉన్నప్పుడే వరుస సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఆ భామలు ఇప్పుడు చేసేదేమి లేక ఐటెం సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు. ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్ లో చేసేందుకు అస్సలు ఆలోచించడం లేదు. ఇప్పుడు ఐటెం సాంగ్స్‌కి సిద్ధంగా ఉన్న భామలలో పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు ఉన్నారు.
శ్రియా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఎందరో టాప్ హీరోలతో కలిసి పని చేసింది. అయితే మధ్యలో క్రేజ్ తగ్గడం, పిల్లలని కని వేరే దేశానికి వెళ్లడంతో ఇక ఈ భామకి అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ.అయితే ప్రత్యేక పాటల్లో చేయడం ఆమెకు కొత్త కాదు.రామ్ ని హీరోగా, ఇలియానాని హీరోయిన్ గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన దేవదాసు సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మున్నా, తులసి,పులి, నక్షత్రం లాంటి సినిమాలలో ఐటెం సాంగ్ చేసి అదరగొట్టింది. ఇక శ్రియ తాజాగా రెట్రో సినిమాతో సందడి చేయబోతోందట.
మరొక హీరోయిన్ పూజ హెగ్డే చాలామంది హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ అమ్మడికి తెలుగు సినిమాలలో అవకాశాలు తగ్గాయి. దీంతో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో ఒక ప్రత్యేక పాటలు చిందులు వేయబోతోందట. గతంలో పూజ హెగ్డే రంగస్థలం, ఎఫ్ 3 సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి మెప్పించిన విషయం తెలిసిందే. ఇక కేతికా శర్మ కూడా హీరోయిన్గా సత్తా చాటింది. ఇక చేసేదేం లేక నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది కేతికా శర్మ.ఈ సినిమాలో అదిదా సర్ప్రైజ్ అంటూ సాగే పాటలో కేతికా శర్మ చిందులు వేసినట్టు తెలుస్తోంది. మరొక హీరోయిన్ రెబా మోనికా జాన్ మ్యాడ్ స్క్వేర్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే. ఇలా అవకాశాలు లేని భామలు ఐటెం సాంగ్స్ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నారు.