Hero vishal | తమిళ హిరో విశాల్ తెలుగు వాళ్లకు పరిచయమే. పందెంకోడి సినిమా నుండి లేటెస్ట్గా వచ్చిన సామాన్యుడు వరకు విశాల్ సినిమాలు డబ్బింగ్ రూపంలో ఇక్కడ విడుదలై మంచి విజయాలను సాధించాయి. ప్రస్తుతం ఈయన లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సన్నివేశాన్నీ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.
లాఠీ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. విలన్స్ దగ్గర నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విశాల్ చేతికి, నుదిటి భాగంలో గాయమైందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన కేరళలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం కారంణంగా ప్రస్తుతం ఈ షూటింగ్‌ను ఆపేశారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫి చేస్తున్నాడు. మార్చి మొదటివారంలో తిరిగి షూటింగ్ ప్రారంభించునున్నట్లు విశాల్ వెల్లడించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునయన హీరోయిన్గా నటిస్తుంది.
Suffered multiple hairline fractures during the filming of this stunt sequence in #Laththi.
Off to #Kerala to rejuvenate myself!Will join the crew for the final schedule from March first week 2022. GB. pic.twitter.com/L1pOByb6hZ
— Vishal (@VishalKOfficial) February 11, 2022