విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఓరి దేవుడా’. మిథిలా పాల్కర్, ఆశా భట్ నాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తున్నది.
‘ఓరి దేవుడా’ చిత్రంలో హీరో వెంకటేష్ దేవుడు పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఈ మేరకు గ్లింప్స్ విడుదల చేసింది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. దీపావళి పండక్కి అక్టోబర్ 21న విడుదలకు సిద్ధమవుతున్నది.