Saindhav | సైంధవ్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్.. అలాంటి పాత్రలో వెంకీ!
Saindhav | వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్'. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం.
Saindhav | వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమాలో బేబీ సారా కీలకమైన పాత్రను పోషిస్తున్నది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
‘ఈ సినిమాలో బేబీ సారా.. గాయత్రి అనే పాత్రలో కనిపిస్తుంది. ఈ కథకు ఆయువు పట్టులా చిన్నారి పాత్ర ఉంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వెంకటేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా సాగుతుంది. తన వారిని రక్షించుకోవడానికి అతను చేసిన పోరాటం ఏమిటన్నది ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు. ఆయన పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రద్ధాశ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, సారా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

