‘కేరింత’ఫేం పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వీఎస్ ముఖేష్ దర్శకుడు. అఖిలేశ్ కలారు నిర్మాత. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌ని హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. సినిమా మంచి విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసుకురావాలని, నిర్మాతకు ఆర్థికంగా లాభాలు చేకూరలని ఆకాంక్షించారు.
సినిమాలో నటించడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొన్నారు. హర్షవర్దన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిస్టర్ జో, కెమెరా: సురేంద్ర చిలుముల.