నోయల్, విశాఖ, ధీమాన్, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘14’. లక్ష్మీశ్రీనివాస్ దర్శకుడు. సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మాతలు. హీరో శ్రీవిష్ణు ముఖ్యఅతిథిగా హాజరై టీజర్‌ను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాతో నోయల్ మంచి స్థాయికి చేరుకోవాలన్నారు. ‘విభిన్నమైన కథ ఇది. నోయల్ పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుంది. సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు తెలిపారు. కథపై పూర్తి విశ్వాసంతో ఉన్నామని నిర్మాతలు పేర్కొన్నారు. నోయల్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. నటుడిగా మంచిపేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: సాయినాథ్, సంగీతం: కల్యాణ్, సంభాషణలు: ఆదిత్య భార్గవ్.