Shah rukh khan | షారుఖ్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రత
90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని అండర్ వరల్డ్ మాఫియా శాసించే పరిస్థితులు ఉండేవి. బలవంతపు వసూళ్లు, బెదిరింపులతో మాఫియా డాన్లు చెలరేగిపోయేవారు. మరలా బాలీవుడ్లో మాఫియా కదలికలు కనిపించడం ఆందోళనకరంగా మారింది.
90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని అండర్ వరల్డ్ మాఫియా శాసించే పరిస్థితులు ఉండేవి. బలవంతపు వసూళ్లు, బెదిరింపులతో మాఫియా డాన్లు చెలరేగిపోయేవారు. మరలా బాలీవుడ్లో మాఫియా కదలికలు కనిపించడం ఆందోళనకరంగా మారింది. కొద్ది మాసాల క్రితం అగ్ర హీరో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వం వై ప్లస్ భద్రతను సమకూర్చింది.
తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్‌కు సైతం ముంబయి మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు కూడా వై ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేటగిరిలో ఆరుగురు సాయుధ సిబ్బంది నిరంతరం షారుఖ్‌ఖాన్ భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు షారుఖ్. ఈ నేపథ్యంలో అండర్ వరల్డ్ మాఫియా నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షారుఖ్‌ఖాన్ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

