రాంచీ: సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth) తాజాగా నటించిన జైలర్ మూవీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్ వెళ్లిన తలైవా రజనీ.. ఇవాళ జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించారు. ఆయన రాంచీలో ఉన్న పరమహంస యోగానంద ఆశ్రమాన్ని విజిట్ చేశారు. అక్కడ గంటసేపు ధ్యానం చేశారు. యోగదా సత్సంగ్ సొసైటీకి వెళ్లారు. పరమహంస యోగానంద భక్తుడు రజనీకాంత్.
రాంచీలో ఉన్న యోగదా ఆశ్రయంలోని స్వామి యోగానంద రూమ్‌లో సుమారు గంట సేపు రజనీ ధాన్యం చేశారు. ఆ తర్వాత ఆశ్రమంలో ఉన్న సీనియర్ స్వాములతో ముచ్చటించారు. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా యోగదా ఆశ్రమానికి వచ్చినట్లు రజనీ తెలిపారు.
రాంచీ సమీపంలో ఉన్న చిన్నమస్త ఆలయాన్ని కూడా రజనీకాంత్ విజిట్ చేశారు. భైరవి, దామోదర్ నదీ సంగమం వద్ద ఈ ఆలయం ఉన్నది. ప్రత్యేక హారతి, పూజ కార్యక్రమంలో యాన పాల్గొన్నారు. అంతకముందు ఉత్తరాఖండ్ టూరలో రజనీకాంత్.. భద్రీనాథ్ ఆలయాన్ని కూడా విజిట్ చేశారు. ద్వారహట్లో ఉన్న పాండవ్కోహ్లీ గుహలో ధ్యానం చేసిన రజనీ అక్కడ నుంచి నేరుగా జార్ఖండ్‌కు చేరుకున్నారు.