ధనుష్ రఘుముద్రి, హెబ్బా పటేల్, నిరోషా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘థాంక్యూ డియర్’. తోట శ్రీకాంత్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పప్పు బాలాజీ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. సోమవారం ఈ సినిమాలోని ‘చిక్కక చిక్కిన గుమ్మ’ అనే గీతాన్ని హీరో మంచు మనోజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ధనుష్‌కు ఈ సినిమా మంచి బ్రేక్నివ్వాలని, వారి కుటుంబం తమకు ఎంతో సన్నిహితులని అన్నారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, యువతకు బాగా నచ్చుతుందని నిర్మాత బాలాజీ రెడ్డి పేర్కొన్నారు. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ అన్నారు. వీరశంకర్, నాగ మహేష్, రవిప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ మహాలక్ష్మి ప్రొడక్షన్స్, దర్శకత్వం: తోట శ్రీకాంత్ కుమార్.