సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది హీరో చిరంజీవి కూతురు శ్రీజ. ఫిట్నెస్, ట్రావెల్ వంటి విషయాలపై పోస్టులు చేస్తుంటుంది. ఆమె తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తికరంగా ఉండి నెటిజన్స్‌ను ఆకట్టుకుంటున్నది. గడచిన ఏడాది గురించి ఆమె స్పందిస్తూ…‘2022 సంవత్సరం నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేసింది.
నన్ను ప్రేమించే, రక్షించే, నా గురించి ఎప్పుడూ ఆలోచించే ఆ వ్యక్తి మరెవరో కాదు నేనే. నన్ను నేను తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’ అని పేర్కొంది. స్వీయ ప్రేమ అనేది అన్నింటికన్నా ముఖ్యమని ఆమె తన పోస్ట్ ద్వారా పేర్కొంది.