‘టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది రెండో వారంలో థియేటర్‌కు వెళ్తున్నారు. అందుకే ‘బడ్డీ’ సినిమాకు సింగిల్ స్క్రీన్ 99, మల్టీఫ్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడి మా నిర్మాతలు టికెట్ రేట్లు తగ్గించారు’ అన్నారు అల్లు శిరీష్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘బడ్డీ’. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు.
ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో టెడ్డీబేర్ ఫస్ట్ హీరో. నేను సెకండ్ హీరో అనుకోవచ్చు. ఇందులో యాక్షన్‌తో పాటు కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి’ అన్నారు. రిలీజ్‌కు ముందు వేసిన షోస్‌కు అద్భుతమైన స్పందన లభించిందని, వినూత్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుందని దర్శకుడు శామ్ ఆంటోన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.