సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రానికి ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాతో ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను హీరో దగ్గుబాటి రానా విడుదల చేశారు. వధూ వరులకు చెట్లతో, జంతువులతో పెండ్ల్లి చేయడం వార్తల్లో చూస్తుంటాం. వివాహాల సందర్భంగా కొందరు అనుసరిస్తున్న ఇలాంటి మూఢనమ్మకాల నేపథ్యంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మోషన్ పోస్టర్ ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. బ్రహ్మాజీ, ఛమ్మక్ చంద్ర, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం : భీమ్స్ సిసిరోలియో.