Bhaag Saale | మత్తు వదలరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహ(Sri Simha). ఈ టాలెంటెడ్ యాక్టర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భాగ్ సాలే’ (Bhaag Saale). ఇప్పటికే రిలీజైన భాగ్ సాలే టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీగా అంచనాలు పెంచేస్తున్నాయి. జులై 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీసింహ, కాలభైరవ, డైరెక్టర్ ప్రణీత్‌ను ఇంటర్వ్యూ చేశారు ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh). అయితే ఇప్పటివరకు ఇంటర్వ్యూలు మాత్రమే ఇస్తూ వస్తున్న బండ్ల గణేశ్ తొలిసారి ఓ హీరోను ఇంటర్వ్యూ చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. తాజాగా దీనిపై స్పష్టత ఇచ్చారు బండ్ల గణేశ్.
ఒక రోజు రంగస్థలం సెట్స్‌లో రాంచరణ్‌ను కలిసేందుకు వెళ్లా. రాత్రి సమయంలో ఓ యువ అసిస్టెంట్ డైరెక్టర్ చాలా కష్టపడి పనిచేస్తుండటం చూశా. ఆ తర్వాత తెలిసింది అతడెవరో కాదు ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా అని. తండ్రి కీరవాణి, అంకుల్ ఎస్ఎస్ రాజమౌళి స్టార్ స్టేటస్‌ను పక్కన పెట్టి.. సెల్ఫ్ మేడ్ స్టార్‌గా కష్టపడుతున్న శ్రీసింహా ఏదో ఒక రోజు పెద్ద స్టార్ అవుతాడని ఆ తర్వాత నా భార్యతో చెప్పా. ఈ సినిమాలో శ్రీసింహా హీరోగా నటిస్తుండటంతో నా కోరిక నెరవేరింది. అందుకే వారిని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేశ్.
అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రానికి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. సింహకు జోడీగా నేహ సోలంకి నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బిగ్ బెన్ సినిమా, సినీ వాల్లే మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించాడు.
బండ్ల గణేశ్ తొలి ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి మరి..