మహా సముద్రం ఫైనల్ కలెక్షన్స్.. శర్వానంద్ కు భారీ డిజాస్టర్..

maha samudram final collections | దసరా సినిమాల ఫైనల్ కలెక్షన్స్ వస్తున్నాయి. అందులో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ముందున్నాడు. ఆ తర్వాత పెళ్లి సందడి సినిమా ఉంది. ఇక శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం మహా సముద్రం నిరాశ పరిచింది. ఆర్ఎక్స్ 100 లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత మూడేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు తొలిరోజు టాక్ తేడాగా వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత సిద్ధూ నటించిన తెలుగు సినిమా ఇది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన మహా సముద్రం సినిమా ఆడియన్స్‌కు కావాల్సిన కిక్ ఇవ్వలేకపోయింది. ఔట్ డేటెడ్ కథకు తోడు స్క్రీన్ ప్లే లోపాలు సినిమాకు మైనస్ అయ్యాయి అంటున్నారు ప్రేక్షకులు. అక్టోబర్ 14న మహా సముద్రం థియేటర్స్‌లోకి వచ్చింది. తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండో రోజు నుంచి చేతులెత్తేసింది. ఇందులో మహా పాత్రలో అదితి రావు హైదరీ నటించింది. అను ఇమ్మాన్యుయేల్ మరో హీరోయిన్. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. శర్వానంద్ ఉన్నాడు కాబట్టి మంచి బిజినెస్ చేశారు. మరి మహా సముద్రం ఫైనల్ కలెక్షన్స్ ( maha samudram final collections ) చూద్దాం..
నైజాం: 2.10 కోట్లు
సీడెడ్: 1.21 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.87 కోట్లు
ఈస్ట్: 0.48 కోట్లు
వెస్ట్: 0.39 కోట్లు
గుంటూరు: 0.57 కోట్లు
కృష్ణా: 0.38 కోట్లు
నెల్లూరు: 0.33 కోట్లు
ఏపీ + తెలంగాణ: 6.34 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.62 కోట్లు
వరల్డ్ వైడ్ 6 డేస్ కలెక్షన్స్: 6.96 కోట్లు షేర్
శర్వానంద్, సిద్ధార్థ్ లాంటి స్టార్స్ ఉండటంతో మహా సముద్రం చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమాను ఏకంగా రూ.16.48 కోట్లకు అమ్మారు. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.17 కోట్ల వరకు రావాలి. కానీ దానికి 10 కోట్ల దూరంలోనే ఆగిపోయి డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. మొత్తానికి శర్వానంద్‌కు జాను, రణరంగం, పడిపడి లేచే మనసు, శ్రీకారం లాంటి సినిమాల తర్వాత మరో ఫ్లాప్‌గా నిలిచిపోయింది మహా సముద్రం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
చిరంజీవి, రజినీకాంత్ సినిమాల మధ్య ఈ పోలికలు గమనించారా..?
50 రోజుల్లో 1000 కోట్ల బిజినెస్.. 2022 ఆరంభంలో అరాచకం..
పునీత్ అంత్యక్రియల విషయంలో కుటుంబ సభ్యుల కీలక నిర్ణయం..
Anupama: అనుపమ అడ్డుకట్టలు తొలగించి లిప్‌లాక్‌లతో చెలరేగిపోనుందా?
Krishnam raju: కృష్ణంరాజుకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మానందం..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

