Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దేవీ నవరాత్రుల సందర్భంగా ఎస్ఎస్డీసీవో దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా ముగిశాయి.
దక్షిణాఫ్రికా : దేవీ నవరాత్రుల సందర్భంగా ఎస్ఎస్డీసీవో దక్షిణాఫ్రికా( South Africa ) ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు ( Bathukamma Celebrations ) ఘనంగా ముగిశాయి. నాగయ్యాస్ మాల్లోని దేవీ మండపంలో జరిగిన వేడుకల్లో 650 మందికి పైగా తెలుగు ప్రజలు ఉల్లాసంగా హాజరయ్యారు.


దేవీ నవరాత్రుల్లో నిత్య పూజలు, ప్రత్యేక వైదిక క్రతువులు నిర్వహించేందుకు ఇండియా నుంచి వచ్చిన వేద పండితులు మనోహర్ శర్మ ప్రత్యేకంగా హాజరై పూజలు చేశారు. పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ, గౌరమ్మను కొలిచే తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగని నిర్వాహ కులు అన్నారు.అరవింద్ చికోటి సమన్వయంతో బీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు పాల్గొన్నారు.
విదేశీ గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ కుటుంబాలు, మిత్రులతో కలిసి జరుపుకున్న వేడుకలు తెలుగు ప్రజల ఐక్యతకు అద్దం పట్టాయి. కమిటీ సభ్యులు అరుణ్ సుంకు, రాజేష్ యార్లగడ్డ, శ్రీధర్ బొల్లోజు, సాతులూరి లక్ష్మీ శ్రీనివాస్, నిర్మల్ నల్లు ఏర్పాట్లను పరిశీలించారు. కేప్‌టౌన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో, చేతన్ కొరోబోయిన సమన్వయంతో కేప్‌టౌన్‌లో కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి.


Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

