KGF 2 Collections | కన్నడ రాకింగ్ స్టార్ యష్ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తూనే ఉన్నాడు. ఈయన నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 వీకెండ్ ముగిసిన తర్వాత కూడా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తోంది. మరీ ముఖ్యంగా తొలి సోమవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల షేర్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 70 కోట్లు ఉంది. ఇప్పటికే 311 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ దుమ్ము దులిపేసింది. మరి ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కేజీఎఫ్ 2 ఎంత వసూలు చేసింది.. ఇంకా ఎంత వసూలు చేయాలో ఒకసారి లెక్కలు చూద్దాం..
నైజాం: 30.63 కోట్లు
సీడెడ్: 8.17 కోట్లు
ఉత్తరాంధ్ర: 5.34 కోట్లు
ఈస్ట్: 3.98 కోట్లు
వెస్ట్: 2.43 కోట్లు
గుంటూరు: 3.25 కోట్లు
కృష్ణా: 2.92 కోట్లు
నెల్లూరు: 1.93 కోట్లు
ఏపీ, తెలంగాణ 5 డేస్ కలెక్షన్స్: 58.66 కోట్లు
కర్ణాటక: 58.60 కోట్లు
తమిళనాడు: 18.25 కోట్లు
కేరళ: 14.20 కోట్లు
హిందీ+రెస్టాఫ్ ఇండియా: 110 కోట్లు
ఓవర్సీస్: 52.20 కోట్లు
వరల్డ్ వైడ్ 5 డేస్ కలెక్షన్స్: 311.90 కోట్లు
ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే మొత్తం రూ.360 కోట్లు వసూలు చేయాలి. ఐదో రోజు 34 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. 6వ రోజు కూడా చాలా చోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. పైగా వీకెండ్ తర్వాత కూడా సినిమా పెద్దగా డ్రాప్ అయినట్లు కనిపించడం లేదు. గ్రాస్ ఇప్పటికే దాదాపు 630 కోట్లు వచ్చింది.
“KGF 2 హ్యాంగోవర్.. ప్రభాస్ సలార్ సినిమాపై ఒక్కసారిగా పెరిగిపోయిన అంచనాలు..”
“డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్న కేజీఎఫ్ స్టార్ యష్..”
Raveena Tandon | అదే బాలీవుడ్‌కు సౌత్ సినిమాలకు తేడా : రవీనాటాండన్”
KGF Chapter 2 | రాకీ భాయ్‌ను ప్రశంసించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్”