Raveena Tandon | అదే బాలీవుడ్‌కు సౌత్ సినిమాలకు తేడా : రవీనాటాండన్
రవీనాటాండన్ (Raveena Tandon) దక్షిణాది చిత్రాల్లో నటించడం ఇది కొత్త కాదు. దశాబ్దాల కిందటే తెలుగు, కన్నడ చిత్రాల్లో నాయికగా నటించింది రవీనా. ఈ అనుభవంతో ఆమె దక్షిణాది చిత్రాలకు, హిందీ సినిమాలకు తేడాను విశ్లేషించింది.
కేజీఎఫ్ 2 చిత్రంలో ప్రధాని రమీకా సేన్ పాత్రలో నటించి ఆకట్టుకుంది బాలీవుడ్ తార రవీనాటాండన్ (Raveena Tandon). ఆమె దక్షిణాది చిత్రాల్లో నటించడం ఇది కొత్త కాదు. దశాబ్దాల కిందటే తెలుగు, కన్నడ చిత్రాల్లో నాయికగా నటించింది రవీనా. ఈ అనుభవంతో ఆమె దక్షిణాది చిత్రాలకు, హిందీ సినిమాలకు తేడాను విశ్లేషించింది. సౌత్ సినిమాల (South cinema)ను స్థానికతను మర్చిపోకపోవడమే వాటి విజయాలు కారణమందీ హీరోయిన్. నేల విడిచి సాము చేయడం వల్లే బాలీవుడ్ (Bollywood) బాక్సాఫీస్ పోరులో వెనకబడిందని చెప్పింది.
ఈ ఏడాది మొదట్లో అరణ్యక్ అనే వెబ్ సిరీస్ లో నటించి విజయాన్ని అందుకున్న రవీనా. ఇప్పుడు వసూళ్లలో చరిత్ర సృష్టిస్తున్న కేజీఎఫ్ 2 (KGF Chapter 2)లో భాగమైంది. హిందీ సినిమా విషయంలో ఇలాంటి ఘన విజయాలను ఎందుకు చూడలేకపోతున్నామని అడిగితే రవీనా స్పందిస్తూ..సౌత్ సినిమాతో నాకు సుదీర్ఘ అనుభవం ఉంది. వాళ్లు తమ స్థానికతను మర్చిపోరు. అలాగే వాళ్ల సంస్కృతీ సంప్రదాయాలు, మూలాలను విడిచిపెట్టరు.
వీటితోపాటు సినిమా కథల్లో భావోద్వేగాలు ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆ ఎమోషన్స్ ను దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. బాలీవుడ్ సినిమా కోల్పోతున్నది ఇదే. హిందీ సినిమా ఎప్పుడూ హాలీవుడ్ ను అనుకరించేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నది..అని చెప్పింది.
Read Also : Laya DJ Tillu Dance | డీజే టిల్లు పాటకు లయ అదిరిపోయే డ్యాన్స్..వీడియో హల్చల్
కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాలు సాధిస్తున్న విజయాలే రవీనాతో ఇలా స్పందించేలా చేశాయి. బాహుబలి రెండు పార్టులు, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ ఇవన్నీ ఉత్తరాది బాక్సాఫీస్ ను కొల్లగొట్టినవే.
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Also : Jayesh Bhai Jordaar Trailer | కొత్త లుక్‌లో రన్ వీర్ సింగ్..ఫన్నీగా ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

