KGF 2 హ్యాంగోవర్.. ప్రభాస్ సలార్ సినిమాపై ఒక్కసారిగా పెరిగిపోయిన అంచనాలు..
Salaar | సాధారణంగా ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. అయితే మొన్న రాధే శ్యామ్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దీంతో ప్రభాస్ నుంచి సూపర్ హిట్ సినిమా రావాలని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వీటిలో ఇప్పుడు అందరి దృష్టి సలార్ సినిమాపై పడింది. దానికి కారణం దర్శకుడు ప్రశాంత్ నీల్.
ముందు నుంచి సలార్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. తాజాగా కేజీఎఫ్ 2 విడుదలైన తర్వాత.. అందులో హీరోను ప్రశాంత్ నీల్ పరిచయం చేసిన విధానం చూసిన తర్వాత ప్రభాస్ అభిమానులు సలార్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ఇది కూడా కేజీఎఫ్ తరహాలో సాగే ఆధిపత్య పోరు నేపథ్యంలో వస్తున్న సినిమా. మనకు పెద్దగా పరిచయం లేని యశ్ లాంటి హీరోనే గూస్ బంప్స్ వచ్చేలా చూపించాడు ఈ దర్శకుడు. అలాంటిది టన్నుల కొద్దీ మాస్ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌ను ఇంకెలా చూపిస్తాడు అనే ఊహే సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే విడుదలైన సలార్ పోస్టర్ సంచలనం సృష్టించింది. కేజీఎఫ్ 2 చూసిన తర్వాత ప్రభాస్ సినిమా బిజినెస్‌కు రెక్కలు వచ్చాయి. ఖచ్చితంగా మరో 100 కోట్ల బిజినెస్ అదనంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీన్ని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతున్నా కూడా దీనిపై దర్శకుడు ప్రశాంత్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఆరేళ్ల కింద శ్రీ మురళి హీరోగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఇదే సినిమా కథలో కొన్ని మార్పులు చేసి పాన్ ఇండియా సినిమాగా ప్రశాంత్ తెరకెక్కిస్తున్నాడని మొదట్నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే సలార్ సినిమా కథ ఒరిజినల్ అని.. ఉగ్రం రీమేక్ కాదని ఇటీవల కేజీఎఫ్ 2 ప్రమోషన్ సమయంలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు.
Read More :
Cinema Review : కేజీఎఫ్-2
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kgf2
- Prabhas
- prashant neel
- salaar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

