డైరెక్ట్ తెలుగు సినిమా చేయనున్న కేజీఎఫ్ స్టార్ యష్..
KGF star Yash | తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్ ఎలాగైతే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడో.. అచ్చంగా అలాగే కేజీఎఫ్ సినిమాతో యశ్ కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన కేజీఎఫ్ రెండో పార్ట్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో రాకింగ్ స్టార్ కేవలం శాండిలవుడ్లోనే కాకుండా దేశమంతటా బర్నింగ్ టాపిక్ అయిపోయాడు. అసలు కన్నడ సినిమా ఇండస్ట్రీని రెండేళ్ల కిందటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ఏకంగా మొదటిరోజే 170 కోట్ల వసూళ్లు తీసుకురావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హిందీ సినిమా రికార్డులను కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 బద్దలు కొడుతున్న తీరు చూసి ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా యష్ డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈయన కోసం ఒక అగ్ర దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల కిందట విడుదలైన కేజీఎఫ్ మొదటి భాగం తెలుగులో కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అయితే ఇప్పుడు మాత్రం రూ.100 కోట్ల వైపు అడుగులు వేసేలా కనిపిస్తోంది. రాఖీ భాయ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఆయనతో నేరుగా తెలుగు సినిమా చేయాలని నిర్మాతలు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిద్దరు అగ్ర దర్శకులు యష్ ను కలిసి తమ ఐడియాలను కూడా షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీటిపై కన్నడ రాకింగ్ స్టార్ కూడా ఆసక్తిగానే ఉన్నాడు.
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగులో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని యష్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా తెలుగు సినిమాపై క్లారిటీ రానుంది. ఆ మధ్య ఒకసారి పూరి జగన్నాథ్ జనగణమన సినిమా ఈయనతోనే చేయాలి అనుకున్నాడు.. కానీ అది కుదరలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఇది తెరకెక్కుతోంది.
Read More :
“K.G.F Chapter-3 | ‘కేజీఎఫ్ చాప్టర్-3’ ప్రీ ప్రోడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయా?”
KGF Chapter 2 | రాకీ భాయ్‌ను ప్రశంసించిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్”
K.G.F Chapter-2 | అప్పుడే ఓటీటీలోకి ‘కేజీఎఫ్ చాప్టర్-2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?”
“Salaar glimps | ‘కేజీఎఫ్ చాప్టర్-2’ థియేటర్లలో ‘సలార్’ గ్లింప్స్?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kgf
- kgf chapter 2
- Tollywood
- Yash
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

