K.G.F Chapter-3 | ‘కేజీఎఫ్ చాప్టర్-3’ ప్రీ ప్రోడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయా?
కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది.
K.G.F Chapter-3 | కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన చిత్రం ‘కేజీఎఫ్’. అప్పటివరకు కన్నడ సినిమాలను ఇతర ఇండస్ట్రీ వాళ్ళు అంతగా పట్టించుకునే వారు కాదు. అలాంటి సమయంలో కేజీఎఫ్ చిత్రం ప్రభంజనం సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ భారీ అంచనాలతో గురువారం విడుదలైంది. ఈ చిత్రం మొదటి షో నుంచే పాజీటీవ్ టాక్‌ను తెచ్చుకుని చాప్టర్-1కు రెట్టింపు స్థాయిలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజే 130కోట్ల కలెక్షన్లను సాధించి హైయెస్ట్ డే1 రికార్డులలో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో వాళ్ళ సినిమాలను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. యష్ నటన, అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు సినీప్రముఖులు సైతం జైజైలు కొడుతున్నారు.
ఇదిలా ఉంటే చాప్టర్-2 చిత్రం ఎండింగ్లో చాప్టర్-3 ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ ఎక్సిక్యూటీవ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ చాప్టర్-3 ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమైయ్యాయని వెల్లడించాడు. దీనిపై కేజీఎఫ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలకపాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

