Salaar glimps | ‘కేజీఎఫ్ చాప్టర్-2’ థియేటర్లలో ‘సలార్’ గ్లింప్స్?
ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే 'రాధేశ్యామ్'తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు.
Salaar glimps | ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ‘రాధేశ్యామ్’తో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచిన ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్‌ను పెట్టాడు. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలనున్నాయి. అందులో ప్రశాంత్‌నీల్ ప్రాజెక్ట్ ఒకటి. ఇప్పటికే ఈ కాంబోపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘కేజీఎఫ్ చాప్టర్-2’ చూసిన తర్వాత సలార్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. చాప్టర్-2 చూసిన ప్రేక్షకులు సలార్‌లో ప్రశాంత్‌నీల్, ప్రభాస్‌ను ఏ రెంజ్లో చూపిస్తాడో అని ఇప్పుటినుంచే ప్రేక్షకులలో అత్రుత మొదలైంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్-2 థియేటర్లలో మేకర్స్ బిగ్ సర్ప్రైజ్ను ఇచ్చారు.
కేజీఎఫ్ చాప్టర్-2 బ్రేక్‌లో ‘సలార్’ గ్లింప్స్‌ను ప్లే చేశారు. పదహారు సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ద మోస్ట్ వయోలెంట్ మెన్.. ప్రభాస్ ఇన్&ఆజ్ అంటూ విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ గ్లింప్స్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రదర్శితంకాలేదు. అయితే కొందరు నెటీజన్లు మాత్రం ఇది ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ చిత్ర టీజర్ మే చివరి వారంలో విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంది. 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
The most Violent👊😡👊 Man #Prabhas Anna in #Salaar 🔥 #KGF2InCinemas pic.twitter.com/kdOchppaXW
— 𝐒𝐮𝐛𝐛𝐮_𝐘𝐒𝐑𝐂𝐏 🇱🇸 (@all_prabhas) April 13, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

