K.G.F Chapter-2 | అప్పుడే ఓటీటీలోకి ‘కేజీఎఫ్ చాప్టర్-2’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం దేశమంతటా 'కేజీఎఫ్ చాప్టర్-2' హవా నడుస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజే 130కోట్ల కలెక్షన్లను సాధించి హైయెస్ట్ డే1 రికార్డులలో మూడో స్థానంలో నిలిచింది.
K.G.F Chapter-2 On OTT | ప్రస్తుతం దేశమంతటా ‘కేజీఎఫ్ చాప్టర్-2’ హవా నడుస్తుంది. సౌత్ నుంచి నార్త్ వరకు కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తుంది. విడుదలైన మొదటి రోజే 130కోట్ల కలెక్షన్లను సాధించి హైయెస్ట్ డే1 రికార్డులలో మూడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా బాలీవుడ్లో వాళ్ళ సినిమాలను సైతం వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. యష్ నటన, అభినయానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రశాంత్ నీల్ టేకింగ్‌కు సినీప్రముఖులు సైతం జైజైలు కొడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధంచిన డిజిటల్ డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రాన్ని విడుదలకు నాలుగు వారాల తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయాలని మేకర్స్ డీల్‌ను కుదిరించుకున్నారట. ఈ క్రమంలో చాప్టర్-2 చిత్రాన్ని మే 13న ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలకపాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

