Pushpa collections in other states | అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా కలెక్షన్స్ మాత్రం మామూలుగా లేవు. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.60 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.39 కోట్ల షేర్ ఉంది. రెండో రోజు కూడా దాదాపు రూ.14 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించాడు పుష్ప. తద్వారా నాన్ బాహుబలి రికార్డులు కూడా సెట్ చేశాడు. మరోవైపు అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఇతర భాషల్లో కూడా పుష్ప ప్రభంజనం కొనసాగడం.
ఇది నిజంగా ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే తెలుగులో మినహా మిగిలిన భాషలలో అంతగా ప్రమోషన్ చేసుకోలేదు దర్శక నిర్మాతలు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమాకు హిందీ, తమిళం ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ, మలయాళంలో ఆల్రెడీ అల్లు అర్జున్‌కు మంచి గుర్తింపు ఉంది. కాబట్టి అక్కడ కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి.. కానీ తమిళనాట బన్నీకి అంతగా గుర్తింపు లేదు. అయినా కూడా పుష్ప సినిమా తమిళంలో కేవలం రెండు రోజుల్లోనే 7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అందులో 4 కోట్ల వరకు షేర్ ఉంది. రంగస్థలం సినిమా తమిళంలో విడుదల చేయడంతో సుకుమార్‌కు మంచి గుర్తింపు వచ్చింది. ఇదే క్రేజ్ ఇప్పుడు పుష్ప సినిమాకు పనికొస్తుంది.
మరోవైపు హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. మొదటి రోజు దాదాపు 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిన పుష్ప.. రెండోరోజు కూడా అంతే వసూలు చేసింది. ఇప్పటికే అక్కడ 7 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది పుష్ప. ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల షేర్.. 97 కోట్ల గ్రాస్ కేవలం రెండు రోజుల్లోనే వసూలు చేసి తెలుగు సినిమా సత్తా చూపించాడు అల్లు అర్జున్. ఈ దూకుడు ఇలాగే కంటిన్యూ అయితే మరో వారం రోజుల్లో పుష్ప కమర్షియల్ గా సేఫ్ అవ్వడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పుష్పలో ఐటెం సాంగ్‌కు సమంతను సుకుమార్ ఎలా ఒప్పించాడు?
పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లో హైయ్యస్ట్ ఫస్ట్ డే షేర్స్ సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు..
బిగ్‌బాస్ షో.. ఈ సీజన్లో అయినా అమ్మాయి గెలుస్తుంది అనుకుంటే..