Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి కూతురు ఐశ్వర్య డైరెక్షన్లో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లాల్‌సలామ్ (Lal Salaam). విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన లాల్ సలామ్ టైటిల్ పోస్టర్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తుండగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
లాల్ సలామ్ వాయిదా పడుతుందంటూ కొన్ని రోజులుగా నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై తలైవా టీం క్లారిటీ ఇచ్చింది. టీజర్ నవంబర్ 12న వస్తుందని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ముంబై గ్యాంగ్‌స్టర్ మోయినుద్దీన్ భాయ్‌గా కనిపించబోతున్నాడు రజినీకాంత్. క్రికెట్, కమ్యూనిజం చుట్టూ సినిమా కథ సాగనుందని సమాచారం. జీవితా రాజశేఖర్, నిరోషా ఈ సినిమాలో భాగం కావడం విశేషం.
‘3’ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య ఆ తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, ‘సినిమా వీరన్’ సినిమాలు తెరకెక్కించింది. చాలా రోజుల తర్వాత తండ్రీకూతుళ్ల కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించగా… లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతోపాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కూడా చేస్తున్నాడు.
Adding a spark ✨ to your Diwali celebration 🪔 with an exciting announcement!💥
Get ready for a 1min 34secs preface of #LalSalaam 🫡 releasing this Sunday, Nov 12 at 10:45AM ⏳
In Cinemas 📽️ PONGAL 2024 Worldwide ☀️🌾 Releasing in Tamil, Telugu, Hindi, Malayalam & Kannada!… pic.twitter.com/0Y0dfi0bHG
— Lyca Productions (@LycaProductions) November 10, 2023
As the shoot 📽️ of #LalSalaam is completely wrapped, the team get together once again to rejoice it! 🤗✨ Off to the post-production now!#LalSalaam 🫡
🌟 @rajinikanth
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
💫 @TheVishnuVishal & @vikranth_offl
🎥 @DOP_VishnuR
⚒️ @RamuThangraj… pic.twitter.com/znDsyIfuzH— Lyca Productions (@LycaProductions) August 9, 2023