మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ క్లోజింగ్ కలెక్షన్స్.. డీసెంట్ హిట్ కొట్టిన అఖిల్..

most eligible bachelor collections | ఆరేళ్లుగా తొలి విజయం కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్న అఖిల్ అక్కినేని కల 2021లో నెరవేరింది. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో మొదటి హిట్ అందుకున్నాడు ఈయన. అక్టోబర్ 15న దసరా కానుకగా విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతను కూడా బాగానే ఆకట్టుకుంది. అదిరిపోయే ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో వాసు వర్మ, బన్నీ వాస్ సంయుక్తంగా సినిమాను నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నాడు. బొమ్మరిల్లు తర్వాత ఆ స్థాయి విజయం లేని భాస్కర్ ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. కథ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయినట్లు కనిపించినా కూడా బాక్సాఫీస్ దగ్గర మాత్రం కాసుల వర్షం బాగానే కురిసింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూద్దాం..
నైజాం: 7.59 కోట్లు
సీడెడ్: 4.08 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.44 కోట్లు
ఈస్ట్: 1.25 కోట్లు
వెస్ట్: 1.04 కోట్లు
గుంటూరు: 1.43 కోట్లు
కృష్ణా: 1.19 కోట్లు
నెల్లూరు: 0.87 కోట్లు
ఏపీ + తెలంగాణ: 19.85 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 3.94 కోట్లు
వరల్డ్ వైడ్ క్లోజింగ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 23.77 కోట్లు షేర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకు రూ. 20.91 కోట్ల బిజినెస్ జరిగింది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 17.23 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే వీక్ డేస్ మొదలైన తర్వాత కాస్త నెమ్మదించింది ఈ సినిమా. కానీ రెండో వీకెండ్ బాగా పర్ఫార్మ్ చేసింది. దాంతో బయ్యర్లకు 3 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. మహా సముద్రం, పెళ్లిసందD సినిమాలతో పోటీ పడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ దసరా విజేతగా నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
లవ్ స్టోరీ ఫైనల్ కలెక్షన్స్.. క్లిష్ట పరిస్థితుల్లో హిట్ కొట్టిన చైతూ..
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Bheemla Nayak : సంక్రాంతి బరి నుండి తప్పుకున్న పవన్.. ఫిబ్రవరిలో సందడి చేసేందుకు సిద్ధం
Fun bucket bhargav : బెయిల్‌పై విడుదలైన ఫన్ బకెట్ భార్గవ్ మళ్లీ జైలుకే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

