Oscar Winning Movies Ott Streaming platforms | ఎన్నో ఏళ్లుగా కోట్లాది మంది భారతీయులు ఎదురు చూస్తున్న అవార్డు రానే వచ్చింది. ఒకటి కాదు ఏకంగా రెండు ఆస్కార్లను గెలిచి భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ శిఖరాగ్రంపై నిలబెట్టాయి. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 95వ ఆస్కార్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకులకు దేశ, విదేశాల నుంచి సినీ తారలు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌తో మొదలైన ఆస్కార్ అవార్డులు.. బెస్ట్ పిక్చర్ అవార్డుతో ముగిసాయి. ఇండియా తరపున ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ను గెలిచాయి. కాగా అవార్డుల ప్రధానోత్సవం ముగిసిందో లేదో.. ఆస్కార్ గెలిచిన సినిమాలు ఏ..ఏ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ అవుతున్నాయో అని నెటీజన్లు తెగ వెతికేస్తున్నారు. ది ఎలిఫెంట్ విస్పరర్స్, ఆర్ఆర్ఆర్తో పాటు ఆస్కార్ గెలిచిన సినిమాలు ఏ ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో అందుబాటులో ఉన్నాయో ఓ లుక్కేద్దాం.

ఈ ఏడాది అత్యధిక ఆస్కార్లు గెలిచిన ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా సోని లివ్‌లో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది.

నాలుగు అవార్డులు దక్కించుకున్న ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీలోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా జీ5తో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‌లో ఉంది. హిందీ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.
‘అవతార్:ది వే ఆఫ్ వాటర్’ సినిమా అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యాపిల్ టీవీ, వుడ్ ఓటీటీల్లో మార్చి 28 నుంచి పే పర్ వ్యూ పద్దతిలో అందుబాటులోకి రానుంది.

‘ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్’ మూవీ ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది.

‘గిల్లెర్మో డెల్ టోరో పినోచియో’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉంది.

‘యాన్ ఐరిష్ గుడ్‌బై’ మూవీ బీబీసి ప్లయర్లో అందుబాటులో ఉంది.
‘నవల్నీ’, ‘వుమెన్ టాకింగ్’, ‘ది వేల్’ సినిమాలు ఇంకా ఓటీటీలోకి రాలేవు.