చిత్రసీమలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్నా..ఇప్పటికీ వన్నె తరగని అందంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది చెన్నై సోయగం త్రిష. కెరీర్ ఆరంభంలో దక్షిణాదిలో అగ్ర తారగా ఓ వెలుగువెలిగిందీ భామ. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నది. దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘లియో’ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయ్‌తో తెరను పంచుకుంటున్నది త్రిష.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్నాయి. యాదృచ్ఛికంగా విజయ్, త్రిష ఇద్దరి కెరీర్లో 67వ చిత్రమిది కావడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ త్రిష అభిమానులు కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. తప్పకుండా ఈ మ్యాజిక్ నెంబర్ సంచలనాలు సృష్టిస్తుందని, ఈ జంట కాంబినేషన్లో మరో హిట్ ఖాయమని అభిమానులు చెబుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ‘లియో’ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో త్రిష నటించనుంది. అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియా ఆనంద్ వంటి భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.