HER : Chapter 1 | టాలీవుడ్ భామ రుహానీ శర్మ (Ruhani Sharma) టైటిల్ రోల్లో నటిస్తోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ HER Chapter 1. శ్రీధర్ స్వరాఘవ్ రైటర్ కమ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రం నుంచి ధీరే ధీరే (Dheere Dheere Song) లిరికల్ వీడియోసాంగ్‌ను జులై 1న లాంఛ్ చేస్తున్నట్టు తెలియజేస్తూ.. సాంగ్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో సినిమా బండి ఫేం వికాస్ వశిష్ఠ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు. జీవన్, రవి వర్మ, ప్రదీప్ రుద్ర, సంజయ్ స్వరూప్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డబుల్ అప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో రఘు సంకురత్రి, దీపికా సంకురత్రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డబుల్ అప్ మీడియా బ్యానర్‌కు ఇది తొలి సినిమా. ఈ చిత్రానికి పవన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన HER Chapter 1 టీజర్ అందరి అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది. ఈ చిత్రంలో రుహానీ శర్మ ఏసీపీగా కనిపించనుంది. 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఏసీపీ రుహానీ శర్మకు ఉన్నతాధికారి ఒకరు ఓ యువతి మిస్టరీ డెత్ కేసును చేధించే పని అప్పగిస్తారు. ఆ కేసును రుహానీ శర్మ కేసు చేధించే క్రమంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నదనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పాడు డైరెక్టర్. ఈ సినిమా ఆడియో హక్కులను సరిగమసౌత్ దక్కించుకున్నట్టు ఇప్పటికే ఓ అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే.
The first single #DheereDheere , a mellifluous number from the Investigative drama #HER starring @iRuhaniSharma will be unveiled on July 1st#VikasVasishta@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri #RaghuSakuratri @saregamasouth @PROSaiSatish
A @SureshProdns Release… pic.twitter.com/G0TW4iqwRr
— BA Raju’s Team (@baraju_SuperHit) June 29, 2023
HER Chapter 1 టీజర్..
ఏసీపీ లుక్‌లో రుహానీ శర్మ..
The intense & intriguing first look of @iRuhaniSharma 's investigative thriller #HER is out now@sswaraghav @doubleupmediaa#DeepaSankuratri#RaghuSakuratri #Pavan #VishnuBesi #ChanakyaToorpu@PROSaiSatish#HERChapter1#HERFirstLook #HER pic.twitter.com/5Xf7AFzotC
— BA Raju's Team (@baraju_SuperHit) December 8, 2022