గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ (RRR) లోని నాటు నాటు సాంగ్‌కు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తన సంగీతంతో మ్యాజిక్ చేసి ప్రపంచానికి తెలుగు పాట క్రేజ్ ఎలా ఉంటుందో నాటు నాటు సాంగ్‌తో ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పటికే మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్‌తోపాటు పలువురు సెలబ్రిటీలు జక్కన్న టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆర్ఆర్ఆర్ సాంగ్‌కు అవార్డు వరించిన నేపథ్యంలో జక్కన్నను పుష్ప డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తనదైన స్టైల్లో ఆకాశానికెత్తేశాడు. ఇటీవల న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 లో ఉత్తమ దర్శకుడిగా జక్కన్న అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అవార్డు అందుకున్న సందర్భంగా రాజమౌళి స్టేజీపై మాట్లాడుతున్న స్టిల్‌ను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు సుకుమార్.
రాజమౌళి మై హీరో అంటూ లవ్ సింబల్ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌పై డైరెక్టర్ శివనిర్వాణ మీరిద్దరూ నా హీరోలు.. నాకు స్పూర్తి.. మనందరం వేడుకగా జరుపుకునే క్షణం అంటూ కామెంట్ పెట్టాడు. యువ దర్శకుడు సందీప్ రాజ్ లవ్ ఎమోజీని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశాడు.
సుకుమార్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్..