Miss Shetty Mr Polishetty | జాతిరత్నాలు ఫేం నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్కా శెట్టి (Anushka shetty) కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్లతోపాటు నో నో నో సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. మిస్టర్ పొలిశెట్టి గుడ్ అండ్ బ్యాడ్ స్టోరీని వీక్షించేందుకు రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ ముందు అందించిన అప్డేట్ ప్రకారం హతవిది లిరికల్ వీడియో (Hathavidi Lyrical) సాంగ్ లాంఛ్ చేశారు.
హతవిది ఏంటిది.. ఊహలో లేనిది బుల్లి చీమ బతుకుపై బుల్డోజరైనది.. అంటూ సాగుతున్న ఈ పాటను ధనుష్ పాడాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాధన్ కంపోజ్ చేశాడు. ధనుష్ స్టైల్లో సాగుతున్న ఈ పాట నెట్టింట హల్ చల్ చేస్తోంది. డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్‌లో సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య సాగిన ట్రాక్‌ను ఫన్ యాంగిల్లో చూపించబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు దర్శకుడు.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని.. ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుంటే.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నాడు. మొత్తానికి సింగిల్స్ గా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
హథవిది లిరికల్ వీడియో సాంగ్..
నోనోనో లిరికల్ సాంగ్..
Miss శెట్టి మిస్టర్ Polishetty టీజర్..