శ్రీసీతారాములకల్యాణం చూతమురారండి, అన్నయ్య, ప్రేమకోసం, శివరామరాజు చిత్రాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో వెంకట్ కమ్ బ్యాక్ ఇస్తున్న మూవీ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకుడు. డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, డాక్టర్ దిక్కల లక్ష్మణరావు నిర్మాతలు.
ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్‌లో సినిమా విడుదల చేయనున్నారు. అన్ని వర్గాల వారికీ నచ్చే పూర్తి మాస్ ఎంటైర్టెనర్ ఇదని దర్శకుడు చెప్పారు. హెబ్బాపటేల్, సలోని, నాటషా, సుమన్, అలీ, శ్రీహరి, రవివర్మ, శుభాశ్రీ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సన్నీ డి, ఆనంద్, సంగీతం: మని జీన్న, నిర్మాణం: మైత్రి ఆర్ట్స్, మైత్రి బాక్సాఫీస్.