Harom Hara | ఈ ఏడాది మొదట్లో ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు టాలీవుడ్ హీరో సుధీర్‌బాబు(Sudheer Babu). ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా అదికూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇక ఈ సినిమా కోసం మూడు డిఫరెంట్ రోల్స్‌లో వైవిధ్యభరితంగా కనిపించడానికి సుధీర్ కష్టపడినా.. సినిమా బోరింగ్‌గా ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఇక ప్రస్తుతం సుధీర్‌బాబు ఆశలన్నీ ఆయన తాజా చిత్రంపైనే. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హరోంహర’(Harom Hara). ‘ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తుండగా.. సుమంత్ జి.నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి విలన్ పాత్రలు పోషిస్తున్న ఫస్ట్ లుక్‌లను మేకర్స్ విడుదల చేశారు. కన్నడ నటుడు రవి కాలే ఈ సినిమాలో బసవ రెడ్డి నటించబోతుండగా.. కేజీఎఫ్ ఫేమ్ లక్కీ లక్ష్మణ్ తమ్మి రెడ్డిగా, అర్జున్ గోవిందా.. శరత్ రెడ్డి పాత్రలో నటించనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియాలో రాసుకోచ్చింది. 1989 నాటికాలం చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో జరిగిన కథాంశంతో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 27న మేకర్స్ విడుదల చేయనున్నారు.
Introducing the most talented & versatile performers!💥@actorarjungowda as #SharathReddy, @Lakkilakshman as #ThammiReddy & #RaviKale as #BasavaReddy from #HaromHara 🔥
POWER of SUBRAMANYAM on NOV 27th@isudheerbabu @ImMalvikaSharma @gnanasagardwara @SumanthnaiduG… pic.twitter.com/soM4D5FKrt
— Vamsi Kaka (@vamsikaka) November 25, 2023
మాళవిక శర్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అక్షర కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చేతన్ భరద్వాజ్.