ద్వారక నేపథ్యంలో ‘హరోం హర’
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ దర్శకుడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం అగ్ర హీరోలు ప్రభాస్, మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వివిధ భాషల్లో విడుదల చేశారు.
సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. జ్ఞానసాగర్ దర్శకుడు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం అగ్ర హీరోలు ప్రభాస్, మమ్ముట్టి, టైగర్ ష్రాఫ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వివిధ భాషల్లో విడుదల చేశారు. హీరోని పోలీసులు అరెస్ట్ చేయడంతో మొదలైన టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. యుద్ధ భూమిలో విజయమే లక్ష్యంగా పోరాడాలనే స్ఫూర్తితో టీజర్ ఆకట్టుకుంది. సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ శక్తిగా హీరో ఎదిగే వైనం ఆసక్తికరంగా ఉంటుందని, ద్వారకా నేపథ్యంలో సాగే పీరియాడిక్ చిత్రమిదని దర్శకుడు తెలిపారు. మాళవిక శర్మ, సునీల్, జేపీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ విశ్వనాథన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్ ద్వారక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

