Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
RudravanamPS | జీ5 వేదికగా అక్టోబర్ 30 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌కు శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించారు.
జీ5 వేదికగా అక్టోబర్ 30 నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘రుద్రవనం పీఎస్’. ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్లపై రమేష్ పుప్పాల, సూర్యకాంతి సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌కు శశిధర్ మున్నంగి దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌కు సంబంధించి బుధవారం నాడు నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో హరీష్ శంకర్ మాట్లాడుతూ.. నిర్మాత రమేష్ పుప్పాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ‘రుద్రవనం పీఎస్’ కంటెంట్ తాను చూశానని, ఇది ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. దర్శకుడు శశిధర్ మున్నంగితో పాటు చిత్ర యూనిట్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సిరీస్‌లో లీడ్ రోల్ పోషించిన నరేష్ అగస్త్య మాట్లాడుతూ, జీ5 తో తన ప్రయాణం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, ‘రుద్రవనం పీఎస్’తో మరో మంచి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని చెప్పారు. దర్శకుడు శశిధర్ మున్నంగి మాట్లాడుతూ.. ఇదొక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అని, ప్రతి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు.
నిర్మాతలు రమేష్ పుప్పాల, సూర్యకాంతి మాట్లాడుతూ.. జీ5 అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్రావణి రెడ్డి, రాజా రవీంద్ర, సుగాలి సిలోని, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొని సిరీస్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నరేష్ అగస్త్య, బెనర్జీ, శివ ఆలపాటి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సిరీస్‌కు తాజ్ సయ్యద్ రచయితగా వ్యవహరించగా, అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ అందించారు. అక్టోబర్ 30 నుంచి జీ5 లో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rudravanam PS | ‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: డైరెక్టర్ హరీష్ శంకర్
Konda Surekha | కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన మాజీ మంత్రి కొండా సురేఖ
Radhika Apte | ప్రకృతిని నమ్ముతాను.. దేవుడిని కాదు: రాధికా ఆప్టే
Student Lasya | లాస్య కుటుంబానికి న్యాయం చేయాలని మార్చురీ వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ధర్నా
Kumar Sangakkara | క్రికెటర్ సంగక్కరకు ఐర్లాండ్‌లో చేదు అనుభవం.. ర్యాన్ఎయిర్ ఎయిర్‌లైన్స్‌పై విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

