Victory Venkatesh | ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాడు టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకర్షించడంలో విజయవంతమైంది. ఈ సినిమా ద్వారా వెంకటేష్ తన కెరీర్లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాడు. అయితే ఈ సినిమా విజయంతో ఉత్సాహంగా ఉన్న ఈ స్టార్ హీరో, తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వెంకటేష్ వివిధ దర్శకుల నుంచి కథలు వినడంలో బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఓ కథను వెంకటేష్‌కు వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ వెంకీకి నచ్చడమే కాకుండా, నిర్మాత సురేష్ బాబు కూడా దీన్ని ఆమోదించినట్లు వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌ను వెంకటేష్ ఖరారు చేసినట్లు చర్చలు జరుగుతున్నాయి.
ఈ చిత్రం వెంకటేష్ కెరీర్లో 77వ సినిమాగా రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత హరీశ్ శంకర్‌కి అసలు హిట్ లేదన్న విషయం తెలిసిందే. దువ్వాడ జగన్నాథం సినిమా కలెక్షన్స్ సాధించిన కూడా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక రీసెంట్గా మిస్టర్ బచ్చన్ అంటూ వచ్చి డిజాస్టార్‌ను అందుకున్నాడు. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసి మీదా ఉన్న హరీశ్ శంకర్ ప్రస్తుతం వెంకీమామ కోసం సాలిడ్ కథ రెడీ చేసినట్లు తెలుస్తుంది.