Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను ఫుల్ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాల్లో ఒకటి హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వంలో పవర్ స్టార్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చేసింది.
తాజాగా మరో లుక్ షేర్ చేసి.. ఊపిరాడకుండా చేస్తున్నాడు హరీష్ శంకర్. పోలీస్ యూనిఫాంలో ఉన్న పవన్ భారీ సుత్తె ఒకటి భుజాన వేసుకుని వెళ్తున్న స్టిల్ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. ఇది ఫ్యామిలీ, యూత్, మాస్ ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించే పక్కా ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైన్మెంట్. సిల్వర్‌స్క్రీన్‌పై పవన్ కల్యాణ్‌ను చూడటం విజువల్ ఫీస్ట్‌లా ఉండబోతుంది.. అని ట్వీట్ చేశాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని తాజా లుక్‌తో అర్థమవుతోంది.
గ్లింప్స్‌లో భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ తనదైన మ్యానరిజంతో చెప్పే డైలాగ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
Its a Family, Youth , & Mass
Energetic entertainer … would be an eye feast to watch BoSS https://t.co/rhdKleLyUs— Harish Shankar .S (@harish2you) October 24, 2023
From the sets of #UstaadBhagatSingh 💥💥 pic.twitter.com/heCqeOEKpt
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) June 5, 2023
ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్..