Harish Shankar | ఫ్యామిలీ కథలకు కమర్షియల్ హంగులు జోడించి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో హరీష్ శంకర్ దిట్ట. ఆయన సినిమాలన్నీ దాదాపు అదే విధంగా ఉంటాయి. ప్రస్తుతం హరీష్ ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. హరీష్ మెగా ఫ్యామిలీకి భక్తుడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ అభిమానినే అంటూ అ మధ్య ఓ స్టేట్మెంట్ ఇచ్చి మెగా ఫ్యాన్స్‌కు హాట్ ఫేవరైట్ దర్శకుడు అయ్యాడు. పవన్ అనే కాకుండా మెగా ఫ్యామిలీలోని అందరు హీరోలతో హరీష్‌కు మంచి బాండింగ్ ఉంది.
ఇప్పటివరకు పవన్ ఏడు సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో నాలుగు మెగా హీరోలవే. ఇక ఇప్పుడు చేస్తున్న ఉస్తాద్ సైతం పవన్‌తోనే. అంతేకాకుండా ఈ నలుగురు హీరోలకు వాళ్ల కెరీర్లోనే ది బెస్ట్ సినిమాలిచ్చాడు. ఇక ఇప్పుడు ఆ వంతు చిరు దగ్గరకు వచ్చినట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ ఇటీవలే ఓ మంచి ఫ్యామిలీ కథతో చిరును కలిసినట్లు తెలుస్తుంది. దానికి చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. నిజానికి హరీష్ ఎప్పటినుంచో చిరుతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అది కుదరలేదు. ఇక ఇన్నాళ్లకు చిరుతో చేసే భాగ్యం వచ్చిందని తెగ సంబురపడిపోతున్నాడట.
అయితే ప్రస్తుతం పవన్‌తో చేయాల్సిన ఉస్తాద్ పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అయితే పవన్ ఇప్పుడు ఉస్తాద్‌కు డేట్స్ సర్దుబాటు చేయలేకపోతున్నాడు. పవన్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలున్నాయి. అందులో హరిహర వీరమల్లు ఊసే లేదు. ఏమున్న ఇప్పుడు బ్రో, ఓజీ రెండు సినిమాల వైపే పవన్ మొగ్గుచూపుతన్నాడు. ఇవి పూర్తయిన తర్వాతే ఉస్తాద్‌కు డేట్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అప్పటివరకు హరీష్ వేచి ఉండక తప్పదు. ఏదైమనా వీళ్ల కాంబోలో ఎప్పుడు సినిమా వచ్చిన అది బ్లాక్ బస్టర్ హిట్టవడం ఖాయమని పవన్ అభిమానులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.