Salman Khan – Harish Shankar | బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రంజాన్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా అనంతరం సల్మాన్ ఖాన్ మరోసారి సౌత్ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో సల్మాన్ సినిమా చేయబోతున్నట్లు బీటౌన్‌లో ప్రస్తుతం వార్తలు వైరలవుతున్నాయి. ఇటీవల సల్మాన్‌ను కలిసిన హరీశ్ శంకర్ అతడికి స్టోరీ చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సల్మాన్ కూడా ఒకే అన్నట్లు టాక్. అయితే ఈ కాంబోకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది.
హరీష్ శంకర్ ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రవితేజ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ను అందుకుంది. దీంతో ఎలాగైన హిట్ కొట్టాలనే కసి మీదా ఉన్న హరీశ్ శంకర్ ప్రస్తుతం సల్మాన్ కోసం సాలిడ్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు హరీశ్ దర్శకత్వంలో రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో షూటింగ్ వాయిదా పడింది. సల్మాన్‌తో రాబోతున్న సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు సమాచారం.