Harish Shankar Telugu Audience | తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం డ్రాగన్. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తుండగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), ఖయదు లోహర్ (Kayadu Lohar) కథానాయికలుగా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న తమిళంతో పాటు తెలుగులో మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తెలుగులో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు మేకర్స్.
ఈ వేడుకకు దర్శకులు హరీశ్‌శంకర్, సాయిరాజేష్, కిశోర్ తిరుమల, నిర్మాత ఎస్కేఎన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. అయితే ఈ వేడుకలో దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మన సినిమాల్ని తప్ప మనం అన్ని సినిమాలను చూస్తాం. అందుకే మన సినిమాలు ఇలా ఆడుతున్నాయంటూ తెలిపాడు. అయితే దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
ముందు మీరు పక్క భాష సినిమాలను రీమేక్ చేయడం తగ్గించి స్ట్రెయిట్ సినిమాలు తీయండ స్టార్ట్ చేయడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక గతేడాది హరీశ్ దర్శకత్వంలో వచ్చి అట్టర్‌ఫ్లాప్ అయిన మూవీ మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ నుంచి వచ్చిన రెయిడ్ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆ ఫ్రస్టేషన్‌తోనే హరీశ్ ఇలా మాట్లాడి ఉండవచ్చంటూ కామెంట్లు పెడుతున్నారు.