Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాలలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ఒకటి. పిరియడికల్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ సినిమాకు రూల్స్ రంజన్ (Rules Ranjan) దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని జున్ 12 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను పంచుకున్నారు మేకర్స్. జూన్ 12న పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరుపం చూడడానికి సిద్ధంగా ఉండడంటూ చిత్రబృందం ప్రకటించింది.
GET READY FOR THE BATTLE OF A LIFETIME! ⚔️🏹
Mark your calendars for #HariHaraVeeraMallu on June 12, 2025! 💥 💥
The battle for Dharma begins… 🔥⚔️ #HHVMonJune12th #VeeraMallu #DharmaBattle #HHVM
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi… pic.twitter.com/3KKNcspFIr
— Hari Hara Veera Mallu (@HHVMFilm) May 16, 2025